V6 News

మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్ స్థలం పరిశీలన

మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్  స్థలం పరిశీలన

ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్  స్థలాన్ని మంగళవారం ఎయిర్​పోర్ట్  అథారిటీ ఆఫ్  ఇండియా అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక డిజైన్  రూపొందించేందుకు మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్  స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. పద్మకోటలోని కీర్తి తోరణం, ఏకశిల గుట్టలోని స్వయంభూ దేవాలయం, రాతి మట్టి కట్టడాలను సందర్శించారు. 

కాకతీయుల శిల్పకళా వైభవాన్ని తిలకించిన అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వారి వెంట కలెక్టర్  డాక్టర్  సత్య శారద, అడిషనల్​ కలెక్టర్  జి.సంధ్యారాణి, ఎయిర్ పోర్ట్  అథారిటీ ఈడీ ఎస్కే గుప్తా, జై గౌరవ్ చౌదరి, జేజీఎం బాలేందర్  కుమార్  తివారి, కేజీఎం గోపాలకృష్ణ పాల్గొన్నారు.