
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతున్న వైరల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై అమీర్ ఖాన్ స్పందించారు. ఇది ఫేక్ వీడియో అని కొట్టి పారేశారు. అంతేకాకుండా ఈ వీడియోపై ఆయన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ వీడియో వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమీర్ ఖాన్ కోరారు.
ఏ ఒక్క పార్టీతో తనకు సంబంధం లేదన్నారు. తన 35 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ కూడా ఏ పార్టీని కూడా ప్రమోట్ చేయలేదని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది. కాగా ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని అమీర్ ఖాన్ కోరారు.