
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్(Aamir khan) కుమార్తె ఐరా ఖాన్(Aira khan) కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అమిర్ ఖాన్ భార్య రీనా దత్తా(Reena datta)తో 2002లోనే విడిపోయాడు. వీరిద్దరి కూతురే ఐరా ఖాన్. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం తనను చాలా డస్టర్బ్ చేసిందని ఐరా తాజాగా తెలిపింది. దాని కారణంగా తాను డిప్రెషన్లోకి వెళ్లానని పేర్కొంది. అయితే, ఇది తన ఒక్కదాని సమస్యే కాదని.. మానసిక రుగ్మతలు తమకు వంశపారంపర్యంగా వస్తున్నాయని చెప్పి షాకిచ్చింది.
ఐదేళ్లుగా ఎంత ప్రయత్నించినా తాను ఇందులోంచి బయటపడలేకపోతున్నానని ఐరా తెలిపింది. 8, 10 నెలలకోసారి తాను డిప్రెషన్లోకి వెళ్తుంటానని.. దీంతో బరువు పెరిగి ఆరోగ్యసమస్యలు వస్తున్నట్టు చెప్పింది. ఈ ఊబిలో కూరుకుపోకుండా తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్టుగా వివరించింది. తన లాంటి వారి కోసం అగస్తు ఫౌండేషన్ ద్వారా ఐరా సేవలు అందిస్తోంది.