ఉత్తరాఖండ్లో ఆప్కు షాక్

ఉత్తరాఖండ్లో ఆప్కు షాక్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని ఆప్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత అజయ్ కొతియాల్ బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరపున అజయ్ కొతియాల్ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. ఇవాళ ఆయన రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పుష్కర్ ధామి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు అజయ్ కొతియాల్ ఆప్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు.