- పూజలుపంజాబ్ సీఎంతో కలిసి ఆలయ దర్శనం
అమృత్సర్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా ఆదివారం అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం దర్శించుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి వెళ్లి ఆయన పూజలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్న సీఎం అర్వింద్ కేజ్రీవాల్విడుదల కావాలని కోరుకున్నట్లు మనీశ్ తెలిపారు. కాగా, మొన్నటి వరకు ఇదే కేసులో సిసోడియా కూడా జైలులోనే ఉన్నారు.
ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సిసోడియా.. తొలిసారి గోల్డెన్ టెంపుల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు కేసులో తనను జైలు పాలు చేశారని, ఆ కేసులో 17 నెలల తర్వాత బెయిల్ వచ్చిం దని చెప్పారు. తనకు బెయిల్ రావడానికి దేవుడే కారణమని, అందుకే కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థన చేసినట్లు వివరించారు.