గుజరాత్‌‌పై ఆప్ స్పెషల్ ఫోకస్

గుజరాత్‌‌పై ఆప్ స్పెషల్ ఫోకస్

ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలపై ఆప్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే పంజాబ్ లో జరిగిన ఎన్నికలు ఆప్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఫుల్ జోష్ లో క్యాడర్ ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆప్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాలు గుజరాత్ కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. భావ్ నగర్ లో మంగళవారం మరో సభలో వీరు పాల్గొంటారు. రెండు రోజుల పర్యటనకు తాను, సిసోడియా వెళుతున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో మాదిరి గుజరాత్ లో మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ లు ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలకు హామీనిస్తున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ప్రజలకు గ్యారెంటి ఇస్తామని, ఉచితంగా వీటిని ప్రజలు పొందే విధంగా తాము చూస్తామన్నారు. గుజరాత్ పర్యటనలో యువతతో వీరు భేటీ కానున్నారని సమాచారం. మరోవైపు...ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంలో కొన్ని గంటల పాటు సీబీఐ సోదాలు జరిపింది. నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 15 మందిలో ఆయన పేరు కూడా ఉంది.