గత 8 ఏళ్లల్లో 3 వేల ఈడీ దాడులు జరిగినయ్: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

గత 8 ఏళ్లల్లో 3 వేల ఈడీ దాడులు జరిగినయ్: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. సీబీఐ, ఈడీ  రైడ్స్ తో  కేంద్రం ఇబ్బంది పెడుతుందని రాజ్యసభలో మండిపడ్డారు. ఇప్పటివరకు 3 వేల వరకు దాడులు చేశారని ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వంటి నేతలపై అక్రమంగా ఈడీ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని విమర్శించారు. ఈ సోదాలలో 0.5% అంటే 23 మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించడంలో ED విజయం సాధించిందన్నారు.

  ‘బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోడీపై ఈడీ ఎందుకు మౌనంగా ఉంది? నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, రెడ్డి బ్రదర్స్, యడ్యూరప్ప, వ్యాపం స్కామ్‌లపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? ఈ  అవినీతిపరులందరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని సంజయ్ సింగ్ రాజ్యసబలో ప్రశ్నించారు. అయితే  సంజయ్ సింగ్ కామెంట్స్ పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అభ్యంతరం చెప్పారు . ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చర్యలుంటాయన్నారు.