ఐదో విడుత అభ్యర్థులను ప్రకటించిన ఆప్

ఐదో విడుత అభ్యర్థులను ప్రకటించిన ఆప్

ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.  భుజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజేశ్‌ పండోరియా, ఇదార్ నుంచి జయంతిభాయ్ పర్ణమి, నికోల్ నుంచి అశోక్ గజేరా, సబర్మతి నుంచి జస్వంత్ ఠాకోరీ, టంకారా నుంచి సంజయ్ భట్సన్, కోడినార్ నుంచి వల్జీభాయ్ మక్వానా, మహుధ నుంచి ఉదైసింగ్ నుంచి రవిజీభాయ్ సోమాభాయ్ వాఘేలాకు సీట్లు కేటాయించింది. మోర్వా నుంచి బవాభా హడాఫ్, దామోర్‌ నుంచి అనిల్‌ గరాసియా, ఝలోద్‌, దేదీయపడ నుంచి చైతర్‌ వాసవ్‌, వ్యారా నుంచి బిపిన్‌ చౌదరి సుమకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సీట్లు కేటాయించింది. ఆప్ ఇప్పటివరకు 53 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఇప్పటి వరకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. 

గత 24 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల 227 రోజులు పాటు సీఎంగా ఉన్నారు. ఆయన కంటే ముందు కేశూభాయ్ పటేల్ 216 రోజులు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. మోడీ తర్వాత ఆనందీబెన్ పటేల్, విజయ్ రూపానీ సీఎంలుగా ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా  భూపేంద్ర పటేల్ ఉన్నారు.