గుజరాత్లో 32 వేల పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నయ్ : సిసోడియా

గుజరాత్లో 32 వేల పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నయ్ : సిసోడియా

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఎనిమిది నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హమీ ఇచ్చారు. ఆప్ బృందం చేసిన పాఠశాలల మ్యాపింగ్ ప్రకారం గుజరాత్‌లోని 48,000 ప్రభుత్వ పాఠశాలల్లో 32,000 పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అహ్మదాబాద్, సూరత్, వడోదర, జామ్‌నగర్, రాజ్‌కోట్, భావ్‌నగర్, గాంధీనగర్, జునాగఢ్ వంటి ఎనిమిది నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తామని సిసోడియా చెప్పారు. 

ఈ ఎనిమిది నగరాల్లో ప్రైవేట్‌ పాఠశాలల కంటే మెరుగ్గా ఉండేలా ప్రభుత్వ పాఠశాలను ఏడాదిలోగా నిర్మిస్తామని సిసోడియా తెలిపారు. రాష్ట్రంలోని 18,000 పాఠశాలల్లో తరగతి గదులు లేవన్న సిసోడియా.. ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.  చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు లేరన్నారు. గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపు  ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని సిసోడియా తెలిపారు.