సామాన్యుడికి న్యాయం చేయడమే ఆప్ లక్ష్యం

సామాన్యుడికి న్యాయం చేయడమే ఆప్ లక్ష్యం

బీజేపీకి ప్రత్యమ్నాయం ఆప్ మాత్రమే: సోమ్నాథ్ భారతి

హన్మకొండ: సామాన్యుడికి న్యాయం చేయటమే తమ పార్టీ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో సోమ్నాథ్ మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీకి ప్రత్యమ్నాయం ఆప్ మాత్రమేనన్నారు. పంజాబ్ ఎన్నికల ఫలితాలతో ఈ విజయం తేటతెల్లమైందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆప్ ను ఆదరించాలని ప్రజలను కోరారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆమ్ ఆద్మీ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి..

విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు