రాఘవ్ చద్ధాపై ఆప్ వేటు..! రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు

రాఘవ్ చద్ధాపై ఆప్ వేటు..! రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చాన్స్​లర్, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమించింది. రాఘవ్ చద్దాకు పార్లమెంటులో మాట్లాడే సమయాన్ని కేటాయించవద్దని ఆప్ ఇప్పటికే రాజ్యసభ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందించింది. 

37 ఏండ్ల రాఘవ్ చద్దా.. ఆప్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రతినిధిగా, ట్రెజరర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు చద్దా దూరంగా ఉండటం.. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలకు క్లీన్ చిట్ వచ్చిన సందర్భాల్లో ఆయన మౌనంగా ఉండటం వంటివి ఈ డిమోషన్ కు దారితీసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.