
ఐపీఎల్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రికెటర్లు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్ లో ఆసీస్ క్రికెటర్ల హవా ప్రతి సీజన్ లో నడుస్తూనే ఉంటుంది. మాథ్యూ హేడెన్, మైఖేల్ హస్సీ,ఆడమ్ గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్,షేన్ వాట్సన్, గ్లెన్ మెగ్రాత్ లాంటి దిగ్గజ క్రికెటర్లు తమ ప్రభావాన్ని చూపగా.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ గా రికార్డ్ ఉన్న ఆరోన్ ఫించ్.. ఐపీఎల్ లో మాత్రం రాణించలేకపోయాడు.
ఈ మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ చాలా ఫ్రాంచైజీలకు ఆడినా అంచనాలు అందుకోలేకపోయారు. అయితే ఈ మెగా లీగ్ లో తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పాడు. ఈఎస్పియన్ క్రిక్ ఇన్ఫో తో ఇటీవల జరిగిన సంభాషణలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మాట్లాడాడు. ఇందులో భాగంగా ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆస్ట్రేలియన్ ఆటగాడిని ఎంచుకోవాలని ఆరోన్ ఫించ్ ను అడిగారు. ఆప్షన్స్ కూడా ఇస్తూ మైఖేల్ హస్సీ, గ్లెన్ మాక్స్వెల్, ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ పేర్లను ఈ ఆసీస్ క్రికెటర్ ముందు ఉంచారు.
ఈ లిస్ట్ చూసిన తర్వాత ఫించ్ వీరందరినీ వదిలేసి ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను లీగ్ లో అత్యుత్తమ ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వార్నర్, గిల్ క్రిస్ట్ గతంలో హైదరాబాద్ జట్లకు టైటిల్స్ అందించారు. వీరిద్దరినీ కాదని వాట్సన్ ను సెలక్ట్ చేసుకున్నాడు. వాట్సన్ తొలి సీజన్ నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ తొలి సీజన్ లోనే రాజస్థాన్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత చెన్నై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో పెద్దగా రాణించకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున అదరగొట్టాడు.