AartiRavi: అనుమానమే నిజమైంది.. సింగర్‌తో జయం రవి: భార్య ఆర్తి రవి ఎమోషనల్‌ పోస్ట్‌!

AartiRavi: అనుమానమే నిజమైంది.. సింగర్‌తో జయం రవి: భార్య ఆర్తి రవి ఎమోషనల్‌ పోస్ట్‌!

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి (Arthi) నుండి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాల వివాహం తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు జయం రవి తెలుపడంతో.. భార్య ఆర్తి విడాకుల నోట్ పై చాలా సార్లు స్పందించింది. ఈ క్రమంలో ఆర్తి రవి మరోసారి (MAY9న) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసింది.

శుక్రవారం మే9న  చెన్నైలో జరిగిన నిర్మాత ఇషారి గణేష్ కుమార్తె వివాహానికి నటుడు రవి, అతని రూమర్ గర్ల్ ఫ్రెండ్, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ అటెండ్ అయ్యారు. ఈ జంట ఒకేరకమైన దుస్తులలో వచ్చి ఫంక్షన్ మొత్తం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అయితే, రవి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం సింగర్ తో తాను రిలేషన్‌లో ఉండటమే అని ఆర్తి ఆరోపిస్తూ వచ్చింది. కానీ, రవి మాత్రం అసలు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, అన్నీ రూమర్స్ అని చెప్పుకొస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలో వీరిద్దరూ ఒకే ఫంక్షన్ లో ఒకటిగా రావడం, చేతులు పట్టుకుని నడవడం వంటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో రవి భార్య స్పందిస్తూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. 

‘గతేడిదిగా నేను ఏం మాట్లాడడం లేదు. నా కంటే నా పిల్లల ప్రశాంతతే ముఖ్యం అనుకున్నా. ఆరోపణలు భరించా. అంతమాత్రాన నా వైపు నిజం లేదని కాదు. కానీ నా పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఎంపిక చేసుకునే భారాన్ని మోయకూడదని నేను కోరుకుంటున్నానని నోట్లో మొదలు పెట్టింది. 

రవి నుండి మద్దతు లేకపోవడంపై ఆమె నిరాశ వ్యక్తం చేస్తూ, ‘నేడు ప్రపంచమంతా జయం రవి, కెనీషా ఫొటోలను చూసింది. మా విడాకుల ప్రాసెస్‌ ఇంకా కొనసాగుతోంది. కానీ, 18 ఏళ్లపాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి బాధ్యతల నుండి కూడా దూరంగా ఉన్నాడు.  కొన్ని నెలలుగా వారి (పిల్లలు) బాధ్యత నాదే. ఆయన్నుంచి ఆర్థికంగానే కాదు నైతికంగానూ సపోర్ట్‌ లేదు. వాటికితోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైంది. నేను లెక్కల కంటే ప్రేమను ఎంచుకున్నాను. లావాదేవీ కంటే నమ్మకం నమ్ముతూ వచ్చాను. అదే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది.

ప్రేమ గురించి నాకు చింత లేదు. కానీ ఆ ప్రేమ బలహీనతగా మారింది. నా పిల్లలు 10 మరియు 14 సంవత్సరాలు. వారికి సరైన భద్రత కావాలి. ఇప్పుడు నేను మౌనంగా ఉండలేను. వారు చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకోవడానికి చాలా చిన్నవారు. కానీ, అతనికి కాల్ చేస్తే ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడం, మీటింగ్స్‌ క్యాన్సిల్‌ చేయడం, మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోవడం.. ఇలాంటివి వారికి తెలుసు’అని వ్రాసుకొచ్చింది. 

చివరగా నోట్ ముగిస్తూ.. ‘నేను ఈ రోజు భార్యగా కాదు. అన్యాయం చేయబడిన స్త్రీగా కూడా కాదు. తన పిల్లల శ్రేయస్సు మాత్రమే లక్ష్యంగా ఉన్న తల్లిగా నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మాట్లాడకపోతే.. జీవితాంతం వారికి భవిష్యత్తు లేకుండా పోతుంది. తండ్రి అంటే కేవలం ఒక బిరుదు కాదు. అది ఒక బాధ్యత.. పిల్లల కోసమే నా పోరాటం ’ అంటూ ఆర్తి ఎమోషనల్ నోట్ ద్వారా చెప్పుకొచ్చింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarti Ravi (@aarti.ravi)

జయం రవి, ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తితో 2009 నుండి వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరైన ఆరవ్, రవి 2018 చిత్రం 'టిక్ టిక్ టిక్'లో ఒక పాత్రను పోషించాడు.

ఆర్తి జయం రవిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడమే కాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తన భర్త అని గర్వంగా రాసుకుంది..'అతని బయో రీడ్ నేను ప్రభావితం చేయాలని ఆశించను, స్ఫూర్తిని పొందాలని ఆశిస్తున్నాను' అని ఇప్పటికీ రాసి ఉండటం విశేషం.

ఇక జయం రవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇదే సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సూపర్ హిట్ గా నిలిచింది.