
నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ జంటగా యోగీ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఆ గ్యాంగ్ రేపు 3’.సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అతిథిగా హాజరైన కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ ‘‘గ్యాంగ్ రేపు’అనే టైటిల్‌తో రెండు భాగాలుగా వచ్చిన షార్ట్ ఫిల్మ్స్‌లో నేను నటించాను.
అందుకే ఈ టీమ్‌తో మంచి స్నేహం ఉంది. ఇప్పుడు మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి వస్తోంది. నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఇందులో చర్చించారు’ అని చెప్పాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు. హీరోహీరోయిన్స్‌తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.