ఆయుష్ శర్మ కొత్త మూవీ అనౌన్స్

ఆయుష్ శర్మ కొత్త మూవీ అనౌన్స్

‘లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాత్రీ’ చిత్రంతో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసిన బాలీవుడ్ నటుడు ఆయుష్ శర్మ.. నాటి నుంచీ సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్ బావమరిదిగా కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తన నాలుగో మూవీకి కమిటయ్యాడు. నిన్న ఆయుష్ పుట్టినరోజు సందర్భంగా ఓ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా తన కొత్త మూవీని అనౌన్స్ చేశారు. ఒక బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒంటరిగా కూర్చుని గిటార్ వాయిస్తున్నాడు ఆయుష్. అంతలో ఆయుధాలు ధరించిన కొందరు అతణ్ని చుట్టుముట్టారు. 

‘నీ పేరేంటి’ అని అడిగారు. ‘గుర్తింపే కదా అసలు సమస్య’ అంటూ వాళ్లపై ఎదురుదాడికి దిగాడు ఆయుష్. చూస్తుంటే ఇదో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అని అర్థమవుతోంది. ఆయుష్ అండర్ కవర్ ఏజెంట్ అయ్యుండొచ్చేమోనని కూడా అనిపిస్తోంది. కాత్యాయన్ శివపురి దర్శకత్వంలో టాలీవుడ్ నిర్మాత కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్నారు. వచ్చే యేడు సినిమా ప్రేక్షకుల ముందుకు కానుంది.