IPL 2025: ఐపీఎల్ 2025.. డివిలియర్స్‌ను ఆకట్టుకున్న ముగ్గురు ప్లేయర్స్ వీరే!

IPL 2025: ఐపీఎల్ 2025.. డివిలియర్స్‌ను ఆకట్టుకున్న ముగ్గురు ప్లేయర్స్ వీరే!

ఐపీఎల్ 2025 లీగ్ దశ మంగళవారం (మే 27)తో ముగియనుంది. రెండు మ్యాచ్ ల తర్వాత టోర్నీలో గురువారం (మే 29) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4 లో నిలిచి ప్లేయర్ ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఈ సీజన్‌లో ఈసారి స్టార్ ప్లేయర్ల కంటే ఎక్కువగా యువ ఆటగాళ్లే సత్తా చాటడం విశేషం. చాలా మంది యువ ఆటగాళ్లు ఈ సీజన్ ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చారు. ఈ సీజన్ లో గురించి మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. తనకిష్టమైన ముగ్గురు ప్లేయర్ల గురించి చెప్పాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 

సాయి సుదర్శన్:

గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సాయి సుదర్శన్ ఈ సీజన్ లో దుమ్ములేపాడు. తన నిలకడతో టాప్ ప్రస్తుతం టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ ల్లో 52 యావరేజ్ తో 679 పరుగులు చేశాడు. టోర్నీలో ఒకటి నుంచి మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టోర్నీ ముగిసేలోపు సాయి సుదర్శన్ ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి. సాయి సుదర్శన్ పట్ల డివిలియర్స్ తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు. గత సీజన్లలో సుదర్శన్ చూపించిన సామర్థ్యం అద్భుతమని.. అతనంటే తనకు ఎప్పుడూ ఇస్తామని డివిలియర్స్ తెలిపాడు. 

డెవాల్డ్ బ్రెవిస్:

"డెవాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడుతూ డివిలియర్స్ ఇలా అన్నాడు. "బ్రేవీస్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతనికి పూర్తి సీజన్ ఆడకపోయినా చెన్నై జట్టులో తన స్థానాన్ని సుస్థిరం  చేసుకున్నాడు. తనకు ఛాన్స్ ఇస్తే ఏం చేయగలడో నిరూపించాడు. అతని ప్రదర్శన నన్ను బాగా ఆకట్టుకుంది". అని డివిలియర్స్ అన్నాడు. ఈసీజన్ లో బ్రెవీస్ సీజన్ మధ్యలో చెన్నై జట్టులో చేరి అదరగొట్టాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో 225 పరుగులు చేయడమే కాదు 180 స్ట్రైక్ రేట్ తో చెలరేగి ఆడాడు. 

 జోష్ హేజిల్‌వుడ్:

"చివరగా ఈ సీజన్‌లో నాకు ఇష్టమైన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్. అతను ఆడుతున్నప్పుడు అందరూ అకస్మాత్తుగా ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. RCB తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు". అని డివిలియర్స్ ఈ ఆర్సీబీ బౌలర్ గురించి చెప్పుకొచ్చాడు. మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్ హాజిల్‌వుడ్ ను రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.