రషీద్ ఖాన్ మ్యాచ్ విన్నర్.. నా ఆల్ టైం టీ20 ప్లేయర్: ఏబీ డెవిలియర్స్

రషీద్ ఖాన్ మ్యాచ్ విన్నర్.. నా ఆల్ టైం టీ20 ప్లేయర్: ఏబీ డెవిలియర్స్

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్సెమెన్ మిస్టర్ 360 తన ఆల్ టైం ఫేవరెట్ టీ20 ప్లేయర్ పేరును బయటపెట్టాడు. అది బెంగళూరు జట్టులోని తన స్నేహితులు విరాట్ కోహ్లీ లేక  క్రిస్ గేల్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. తన ఫేవరెట్ ప్లేయర్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అని చెప్పాడు. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చిన డివిలియర్స్ ఈ విధంగా అన్నాడు. 

‘రషీద్ ఖాన్ బ్యాటింగ్, బౌలింగ్ చేయగలడు. అతను రెండు విభాగాల్లో మ్యాచ్ విన్నార్. ఫీల్డి్ంగ్ లోనూ చురుకుగా ఉంటాడు. అతనిది సింహం లాంటి గుండె. మ్యాచ్ ఏ స్టేజ్ లో ఉన్నా గెలవాలని కోరుకుంటాడు. పట్టుదలగా ఆడతాడు. ప్రత్యర్థులకు పోటీనిస్తాడు. అందుకే రషీద్ నా ఆల్ టైం ఫేవరెట్ టీ20 ప్లేయర్’ అంటూ చెప్పుకొచ్చాడు.

రషీద్ 2017లో సన్ రైజర్స్ నుంచి బరిలోకి దిగి 14 మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు. 2017 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ తరుపున 93 వికెట్లు తీసుకున్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ కు ప్రతినిథ్యం వహించిన రషీద్ 19 వికెట్లు తీసి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.