ఏబీ డివిలియర్స్ జోస్యం..ఫైనల్కు ఆ రెండు జట్లే వెళ్తాయట..!

ఏబీ డివిలియర్స్ జోస్యం..ఫైనల్కు ఆ రెండు జట్లే వెళ్తాయట..!

ఉత్కంఠగా సాగిన టీ20 వరల్డ్ కప్ 2022లో చివరి దశకు చేరుకుంది. అంచనాఅలకు తగ్గట్లుగా రాణించిన టీమిండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి. ఇక అదృష్టంతో పాకిస్తాన్ సెమీస్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో 9, 10వ తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి ఏ జట్లు వెళ్తాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్  ఫైనల్ కు వెళ్లే జట్లేవో తేల్చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ రెండు జట్ల మధ్యే జరుగుతుందని జోస్యం చెబుతున్నాడు. 


 
ఆ రెండు జట్లే...
టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్స్ టీమిండియా, న్యూజిలాండ్ జట్లు చేరుకుంటాయని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చెప్పేశాడు. పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి సెమీస్ లో  న్యూజిలాండే విజయం సాధిస్తుందని వెల్లడించాడు. అలాగే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్లో టీమిండియాదే విజయమన్నాడు. దీంతో మెల్ బోర్న్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడతాయని జోస్యం చెప్పాడు. అంతేకాదు ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 

రోహిత్ రాణిస్తాడు..


టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా ప్రదర్శన అద్భుతమని డివిలియర్స్ అన్నాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ గొప్పగా ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడన్నాడు. కానీ జట్టుకు అవసరమైన సమయంలో అతను రాణిస్తాడని నమ్మకం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు బలంగా కనిపిస్తోందన్నాడు.