
టీమిండియా, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తాడు.. ధనాధన్ టీ20 లీగులో వన్డే తరహాలో ఆడుతాడని.. టీ20ల్లో క్లోహీ స్ట్రైక్ రేట్‌పై కొందరు విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు చేసే వారికి మాజీ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ డివిలియర్స్ గట్టిగా ఇచ్చిపడేశాడు. చెన్నైపై కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రస్తావిస్తూ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా కోహ్లీ ‘మిస్టర్ సేఫ్టీ’ అని కొత్త పేరు పెట్టి.. తన సహచర ఆటగాడిని ఆకానికెత్తాడు.
‘‘విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతాడు. ఏ విధంగా ఆడితే జట్టుకు మేలు జరుగుతుందనిపిస్తే అతడు అలాగే బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ ఆర్సీబీకి మిస్టర్ సేఫ్టీ లాంటివాడు. అతను క్రీజులో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు.. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే. ఏమి మారలేదు. కోహ్లీ క్రీజులో ఉంటే ఇక మీరు భయపడకండి. కోహ్లీ చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తాడని కొందరు మీడియా మిత్రులు అన్న విషయం నాకు గుర్తుంది. మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెన్నైతో జరిగిన మ్యాచులో విరాట్ దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. మరీ ఇప్పుడేమంటారు..?’’ అని విమర్శకులకు డివిలియర్స్ కౌంటర్ ఇచ్చాడు.
కాగా, బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచులో కోహ్లీ దుమ్మురేపాడు. తన శైలీకి భిన్నంగా ఊరమాస్ బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు. ఇందులో 50 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. నార్మల్‌గా కోహ్లీ సింగల్స్, డబుల్స్ ఎక్కువగా తీస్తుంటాడు.
కానీ చెన్నైతో మ్యాచులో మాత్రం ఫోర్లు, సిక్సర్లు వర్షం కురిపించాడు. తన స్ట్రైక్ రేట్‌పై విమర్శలు చేసేవారికి ఈ ఇన్సింగ్స్‌తో కోహ్లీ సమాధానం ఇచ్చాడు. తను స్లోగా ఆడగలను.. స్పీడ్‌గా ఆడగలనని విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లైంది. ఇక.. ఈ సీజన్లో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 11 ఇన్నింగ్స్‌లలో 63.12 సగటు, 143.46 స్ట్రైక్ రేట్‌తో 505 పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.