A ఫర్ యాపిల్..B ఫర్ బ్యాట్ కాదు...ఇక అంతా రామనామమే..

 A ఫర్ యాపిల్..B ఫర్ బ్యాట్ కాదు...ఇక అంతా రామనామమే..

శ్రీరామ నామావళి  గుర్తు ఉండేలా పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది.  ప్రస్తుతం స్కూళ్లలో తెలుగు మాట్లాడం  కొంతమంది తప్పుగా భావిస్తున్నారు.  అంతా ఆంగ్లమయం... ఇక హిందువుల దేవుళ్లు.. పేర్లను మర్చిపోతున్నారు.  ఇంగ్లీషు అక్షరాలను చెప్పేటప్పుడు శ్రీరామ నామావళితో చెపితే.. హిందూ ధర్మానికి న్యాయం చేసినవారవుతారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య.. బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించే జనాలు చర్చించుకుంటున్నారు.  హైటెక్ యుగంలో స్కూళ్లలో పిల్లలకు పాఠాలకు చెప్పేటప్పుడు  A ఫర్ యాపిల్..B ఫర్ బ్యాట్ .. C ఫర్ క్యాట్ అని ఇలా అక్షరాలు నేర్పుతూ పాఠాలు చెబుతున్నారు.  కాని పాశ్చాత్య పురాణాలు.. వాటి విశిష్ఠత గురించి పిల్లలకు ఎక్కడా బోధించుట లేదు.  పిల్లలకు ఇలా చెబితే శ్రీరాముడి అవతారాలు... ఆయన నామాలు పిల్లలకు తెలిసే అవకాశం ఉంది.  కనీసం అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట రోజయినా పిల్లలకు అక్షరాలను ఇలా నేర్పండి. . . 

  • A - అయోధ్య రామ
  • B - భార్గవ రామ
  • C - చిన్మయ రామ
  • D- దశరథ రామ
  • E - ఈశ్వర రామ
  • F - ఫల్గుణ రామ
  • G - గుణాత్మక రామ
  • H - హనుమత రామ
  • I -  ఇనయ రామ
  • J - జగదభి రామ
  • K - కౌసల్య రామ
  • L - లక్ష్మణ రామ
  • M - మర్యాద రామ
  • N - నరహరి రామ
  • O -  ఓంకార రామ
  • P - పురుషోత్తమ రామ
  • Q - కుశలవ రామ
  • R - రఘుకుల రామ
  • S - సీతా రామ
  • T - తారక రామ
  • U - ఉదాత్త రామ
  • V - వశిష్ఠ రామ
  • W - వైకుంఠ రామ
  • X - జితేంద్ర రామ
  • Y - యోగిత రామ
  • Z - జనహిత రామ