కాందహార్ హైజాక్ మాస్టర్ ​మైండ్​.. అబ్దుల్ రవూఫ్ అజార్ ఖతం

కాందహార్ హైజాక్ మాస్టర్ ​మైండ్​.. అబ్దుల్ రవూఫ్ అజార్ ఖతం
  • ఆపరేషన్ ​సిందూర్​లో మట్టుబెట్టిన భద్రతాదళాలు
  • ప్రస్తుతం జైషే నంబర్‌-2గా ఉన్న రవూఫ్
  • పఠాన్‌కోట్, పార్లమెంటుపై దాడుల్లో ప్రమేయం

న్యూఢిల్లీ:  ఆపరేషన్ సిందూర్ లో కాందహార్ హైజాక్ సూత్రధారి జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉగ్ర సంస్థ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌలానా మసూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోదరుడు, ప్రస్తుతం జైషే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2గా ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ మృతి చెందాడు. మంగళవారం రాత్రి భారత భద్రతా దళాలు బహవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జైషే ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జైషే చీఫ్ మొహమ్మద్​మసూద్​అజార్​కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అతని నలుగురు అనుచరులు కూడా మరణించారు. అందులో మసూద్ అజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. అబ్దుల్ రవూఫ్ అజార్.. ఉగ్రవాద సంస్థ జైషేకు సెకండ్- ఇన్ -కమాండర్​గా పనిచేస్తున్నాడు. 1999లో కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రధాన సూత్రధారి ఇతడే. 2016 పఠాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్ ఉగ్రవాద దాడి, 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలోనూ పాల్గొన్నాడు. ఇండియా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ కు చెందిన ఐసీ 814 విమానం 190 మంది ప్యాసింజర్లతో ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరగా.. ఐదుగురు టెర్రరిస్టులు హైజాక్​చేసి కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి.. భారత్​జైళ్లలో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను విడిపించుకు పోయారు. అందులో మసూద్​అజార్ కూడా ఉన్నాడు. కాగా, ఆపరేషన్​సిందూర్​పేరుతో బహవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో మసూద్​అజార్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, ఐదుగురు పిల్లలు, అజార్ తల్లి, ముగ్గురు ముఖ్య సహాయకులు ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపాడు. అంతేకాకుండా.. ఈ దాడిలో అబ్దుల్ రవూఫ్ అజార్ కొడుకు కూడా మృతిచెందినట్టు తెలిసింది.