
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ రాకపై దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. పాక్ లో చిక్కుకున్న అభినందన్ కోసం రెండ్రోజులు ప్రార్థనలు చేసిన ప్రజలంతా ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. పూజలు చేస్తూ కొందరు.. క్రాకర్స్ కాలుస్తూ మరికొందరు.. స్వీట్ల పంచుకుంటూ ఇంకొందరు పండుగ వాతావరణంలో మునిగిపోయారు.
రాష్ట్రానికి చెందిన ఓ కళాకారుడు మాత్రం తన ఆనందాన్ని ఆర్టిస్టిక్ గా వ్యక్తం చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ అభినందన్ చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కాడు. తన కళతో దేశభక్తిని ఇలా చాటుకున్నాడు.