ఆమెకు నా పర్మిషన్ అవసరం లేదు.. నెటిజన్ ప్రశ్నకు అభిషేక్ స్టన్నింగ్ రిప్లై

ఆమెకు నా పర్మిషన్ అవసరం లేదు.. నెటిజన్ ప్రశ్నకు అభిషేక్ స్టన్నింగ్ రిప్లై

స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఈ జంట గురించి అందరికీ తెలిసిందే. తాజాగా నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యరాయ్ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఏం చేయాలన్న తన పర్మిషన్ అవసరం లేదంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్న కారణమేమిటంటే..

మణిరత్నంలో దర్శకత్వంలో హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పొన్నియన్ సెల్వన్ 2 లో ఐశ్వర్యరాయ్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ఏప్రిల్28న విడుదలై మంచి టాక్ ను కూడా తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా పొన్నియన్ సెల్వన్ 2 మూవీపై స్పందించిన అభిషేక్.. ఈ సినిమా అద్భుతంగా ఉందని, ఈ సినిమా కోసం మణిరత్నం సర్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ.. ఇలా అందరూ బాగా పనిచేశారని ట్వీట్ చేశారు. అందులో భాగంగా చిత్ర యూనిట్ అభినందనలు తెలియజేసిన అభిషేక్.. తన భార్య ఐశ్వర్యరాయ్ వల్ల తాను కూడా గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. ఐశ్వర్య బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని కొనియాడారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు.

ఇంతలోనే ఓ నెటిజన్.. ఇప్పుడైనా ఐశ్వర్యరాయ్ ని మరిన్ని సినిమాలకు సైన్ చేయనివ్వండి. ఆరాధ్యని మీరు చూసుకోండి అని కామెంట్ చేయడంతో అభిషేక్ ఓ స్టన్నింగ్ రిప్లై ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఆమెను సైన్ చేయనివ్వడమేంటి సర్.. ఏం చేయడానికైనా ఆమెకు తన పర్మిషన్ అవసరం లేదని చెప్పేసారు. ముఖ్యంగా ఆమె ఇష్టపడేవాటి కోసం అని రిప్లై ఇచ్చారు. దీంతో అభిషేక్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఐశ్వర్యకు తన పర్మిషన్ అవసరం లేదు, ఏమైనా చేసుకోవచ్చు అన్న అభిషేక్ మాటలకు పలువురు నెటిజన్లు అభిషేక్ ని పొగుడుతున్నారు. పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. తమ పాపులారిటీని రోజురోజుకూ పెంచుకుంటూ వస్తున్న ఈ స్టార్ కపుల్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందంటూ మరికొందరు స్పూర్తిగా తీసుకుంటున్నారు.

https://twitter.com/juniorbachchan/status/1652304074476490753