
టీమిండియా స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ వివాహం శుక్రవారం (అక్టోబర్ 3) అమృత్‌సర్‌లో గ్రాండ్ గా జరిగింది. బిజినెస్ మ్యాన్ లోవిష్ ఒబెరాయ్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఈ గ్రాండ్ వేడుక ఎంతో ఆనందంగా భారత ఆచారాలతో నిండిపోయింది. సోదరి పెళ్లి అయినప్పటికీ అభిషేక్ శర్మ ఆమె వివాహానికి హాజరు కాలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషేక్ తన సోదరితో వివాహానికి హాజరు కాలేకపోవడంతో ఆమె బాగా నిరుత్సాహానికి గురైంది. తన జీవితంలో చాలా పెద్ద రోజైన పెళ్లికి అభిషేక్ శర్మ లేకపోవడంతో అతడిని ఆమె మిస్ అవుతున్నానని విచారం వ్యక్తం చేసింది.
కోమల్ శర్మ మాట్లాడుతూ.. "ఇది నాకు చాలా గొప్ప రోజు. నేను ఈ రోజు వివాహం చేసుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. నా సోదరుడు అభిషేక్ ను మిస్ అవుతున్నాను". అని ఆమె ఎమోషనల్ గా చెప్పింది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలో అభిషేక్ ఉన్నాడు. ఈ వేడుకలో భాగంగా భాంగ్రా పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. సింగర్ రంజిత్ బావాతో కలిసి అభిషేక్ సూపర్ స్టెప్స్ తో సందడి చేశాడు. అభిషేక్ క్రికెట్ గురువుగా భావించే యువరాజ్ సింగ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
#WATCH | Punjab: Sister of Cricketer Abhishek Sharma, Komal Sharma ties the knot with businessman Lovish Oberoi in Amritsar. pic.twitter.com/BFpUNTx9Q3
— ANI (@ANI) October 3, 2025
ఆస్ట్రేలియా ఏ తో మ్యాచ్:
శుక్రవారం (అక్టోబర్ 3) ఆస్ట్రేలియా ఏ తో జరిగిన వన్డే మ్యాచ్ కారణంగా అభిషేక్ అతని సోదరి వివాహానికి హాజరు కాలేకపోయాడు. ఇండియా ఏ తరపున ప్రకటించిన రెండు, మూడు వన్డేలకు అభిషేక్ కు ఛాన్స్ దక్కింది. ఆసియా కప్ ఫైనల్ ఆడడంతో తొలి మ్యాచ్ ఆడలేకపోయిన అభిషేక్ రెండో మ్యాచ్ లో బరిలోకి దిగాడు. ఎన్నోయ్ అంచనాల మధ్య ఓపెనర్ గా బ్యాటింగ్ బరిలోకి దిగిన అభిషేక్.. తొలి బంతికే డకౌటయ్యాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు డకౌట్ కావడంతో అభిషేక్ స్థానంపై సందేహాలు నెలకొన్నాయి. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు