విజయ్ దేవరకొండతో సినిమా తీసి దివాళా తీశాం.. వాళ్లకు కోటి ఇస్తాడా.

విజయ్ దేవరకొండతో సినిమా తీసి దివాళా తీశాం.. వాళ్లకు కోటి ఇస్తాడా.

వాళ్లకు కోటి రూపాయలు ఇస్తాడంట.. వంద మందికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు ఇస్తాడంట.. అది సరేకానీ.. ముందు నీతో సినిమా తీసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇవ్వండి.. నీ సినిమా విడుదల చేసి 8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్ల సంగతి తేల్చండి అంటూ హీరో విజయ్ దేవరకొండపై ఎదురుదాడి మొదలుపెట్టారు సినిమా డిస్ట్రిబ్యూటర్లు. అప్పట్లో విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీని విడుదల చేసి అక్షరాల ఎనిమిది కోట్ల రూపాయలు నష్టపోయామని.. ఇప్పటి వరకు ఆ డబ్బుల సంగతి మాట్లాడటం లేదంటూ మరోసారి మండిపడ్డారు అభిషేక్ పిక్చర్స్ ప్రతినిధులు. ఈ మేరకు ఎక్స్ లో కామెంట్ చేశారు.

ALSO READ : పురుగుల మందు తాగిన ఇద్దరు విద్యార్థులు మృతి

అప్పుడెప్పుడో సినిమా విడుదల అయ్యి.. నష్టపోతే ఇప్పుడు ఎందుకు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది అంటారా.. దీనికి కారణం లేకపోలేదు. ఖుషీ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్ లో 100 మందికి.. లక్ష రూపాయల చొప్పు.. కోటి రూపాయల సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో హీరో విజయ్ దేవరకొండపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయానికి మెచ్చుకుంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. 

అయితే ఒక ప్రొడక్షన్‌/డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ మాత్రం అందుకు వ్యతిరేకంగా స్పందించారు. ఆ సంస్థ స్పందించిన తీరు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌ లో ఉన్న ప్రముఖ ప్రొడక్షన్‌ సంస్థలలో ఒకటైన అభిషేక్‌ పిక్చర్స్‌.. విజయ్‌ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాను రిలీజ్‌ చేసింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలువడంతో.. అభిషేక్‌ పిక్చర్స్‌ కు రూ. 8 కోట్లు నష్టపోయింది. ఇదే విషయంపై ట్వీట్‌ వేస్తూ విజయ్‌ను ట్యాగ్ చేసింది అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ.. మీరు(విజయ్ దేవరకొండ) పెద్ద మనసుతో వంద కుటుంబాలకు కోటి రూపాలయలు ఇస్తున్నారు మంచిదే కానీ.. వరల్డ్ ఫేమస్ లవర్‌ సినిమాకు మేము నష్టపోతే ఒక్కరు కూడా స్పందించలేదు. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్‌లకు అండగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.  మరి ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.