ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తం : అమిత్ షా

ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తం : అమిత్ షా

బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.  మోదీ పాలనలో ఉగ్రదాడులు ఉండవని  తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.

 తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీరింగ్ ఇంకా ఓవైసీ చేతిలోనే ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటిఎంలా మారిందని ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీ అధ్భుతంగా విజయం సాధించబోతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.