ఏపీలో అన్న క్యాంటీన్లు మూసేస్తున్నారు!

ఏపీలో అన్న క్యాంటీన్లు మూసేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. ఎన్నికల ముందు హడావుడిగా తాత్కాలిక షెడ్లలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయి. సరైన వసతి లేకపోవడం… ప్రభుత్వం నుండి బకాయిలు అందకపోవడంతో.. వీటిని మూసేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రూ. 5 కే పేదలకు భోజనం  పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మొత్తం 200పైగా ఈ క్యాంటీన్లను ఏర్పాట్లు చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహణ బాగానే ఉన్నా.. వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన 50 వరకు అన్నా క్యాంటీన్లను మూసేస్తున్నారు.

వీటి నిర్వహణకు సరైన ప్రణాళిక లేకపోవడం.. సరైన వసతి, షెడ్లు లేకపోవడం… ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాకపోవడం అందుకు కారణాలని తెలుస్తోంది. ఈ క్యాంటీన్ల కోసం అహారం సరఫరా చేస్తున్న అక్షయ పాత్ర సంస్థకు.. అర్ధిక నిధులు సమకూర్చే పరిస్థితి లేకపోవడంతో.. పలు మండల కేంద్రాల్లో షెడ్లలో పెట్టిన అన్నా క్యాంటీన్లను మూసేస్తున్నట్టు చెప్పారు. శాశ్వత భవనాల్లోని అన్న క్యాంటిన్లు ఎప్పటిలాగే నడుస్తాయన్నారు.