దేశంలో ఒక్కరోజే 90 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో ఒక్కరోజే 90 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. తాజాగా శనివారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీగా నమోదుకావడం ఇదే మొదటిసారి. గ‌త 24 గంట‌ల్లో 90,633 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. గత మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు 80 వేలకు పైగానే నమోదవుతున్నాయి. శనివారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 లక్షలు దాటింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 41,13,812కి చేరింది. ఇందులో 8,62,320 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 31,80,866గా ఉంది. శనివారం దేశవ్యాప్తంగా 1065 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 70,626కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

శనివారం దేశవ్యాప్తంగా 10,92,654 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 4,88,31,145 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

For More News..

తెలంగాణలో మరో 2,574 కరోనా పాజిటివ్ కేసులు

డిశ్చార్జ్‌లలో రికార్డ్.. ఒక్కరోజులోనే 70 వేల మంది డిశ్చార్జ్

దొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే