-in-Adani-Group-Rs.-14,400-crore-will-be-invested_dxAm8MwiWB.jpg)
- అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ. 3,850 కోట్లు..
- అదానీ ట్రాన్స్‌మిషన్‌లో రూ. 3,850 కోట్లు
- అదానీ ఎంటర్‌ప్రైజస్‌లో రూ.7,700 కోట్లు
న్యూఢిల్లీ: అబుదాబి గ్రూప్.. ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) అదానీ గ్రూప్‌లో రూ. 14,400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తమ గ్రూప్‌లోని మూడు కంపెనీలలో ఐహెచ్సీ ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ వెల్లడించారు. మూడు కంపెనీలలోనూ ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద ఈక్విటీ షేర్లను ఐహెచ్సీ తీసుకోనుంది. అయితే ఎంత ఈక్విటీ వాటా తీసుకోనుందనే వివరాలను మాత్రం గౌతమ్ అదానీ చెప్పలేదు. ఈ పెట్టుబడి ప్రపోజల్‌కు సెబీ, షేర్హోల్డర్లతోపాటు ఇతర రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉంటుంది. ఇండియాలోనూ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలోనూ ఉన్న ఆపర్చునిటీస్ను బిజినెస్‌గా మలుచుకోవడానికి అదానీ గ్రూప్, ఐహెచ్సీలు కలిసి పనిచేయనున్నాయి. సస్టెయినబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్స్మిషన్ వంటి రంగాలలో రెండు గ్రూప్‌లకు ఒకే విజన్ ఉందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ చెప్పారు. రెండు గ్రూప్‌ల మధ్య బంధం మరింత బలపడటానికి ఈ ట్రాన్సాక్షన్ దారి తీస్తుందని, యూఏఈ నుంచి మరిన్ని పెట్టుబడులు దేశంలోకి రావడానికీ వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.