
హైదరాబాద్ లోని నాంపల్లి నవీన్ మిట్టల్ ఆఫీస్ ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని, కాలేజీ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 35 రద్దు చేయాలని కోరారు. అయితే ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.