ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
  • 4 పదవులకు 3 కైవసం
  •     ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గెలిచిన ఏబీవీపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దబాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు శోకీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     పూర్తిగా చతికిలపడ్డ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం(డీయూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ) ఎన్నికల ఫలితాల్లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. నాలుగు కీలక సెంట్రల్ ప్యానెల్ పదవుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ టికెట్ నిరాకరించడంతో రెబెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు శోకీన్ భారీ మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. శనివారం మొత్తం 20 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు తుది ఫలితాలను ప్రకటించారు.

ఏబీవీపీకి చెందిన యశ్ దబాస్ 24,576 ఓట్లతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ అభ్యర్థి విజయ్ శంకర్ మీనా (22,523 ఓట్లు) పై గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ మాజీ నేత దీపాంశు శోకీన్ ఏకంగా 30,615 ఓట్లు సాధించి భారీ మెజారిటీతో సంచలన విజయం నమోదు చేశారు. ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్య (16,910 ఓట్లు) రెండో స్థానంలో, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ అభ్యర్థి వీర్ చత్రత్ (4,313 ఓట్లు) మూడో స్థానంలో నిలిచారు. సెక్రెటరీగా ఏబీవీపీ అభ్యర్థిని రియా ఛావడీ 21,650 ఓట్లతో విజయం సాధించారు. జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీగా ఏబీవీపీకి చెందిన లక్ష్య రాజ్ సింగ్ 16,615 ఓట్లతో గెలుపొందారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు విజేతలు, వారి  మద్దతుదారులు క్యాంపస్ లోపల గానీ, బయట గానీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని అధికారులు స్పష్టం చేశారు.   

హాస్టల్ వసతే తొలి ప్రాధాన్యం: యశ్ దబాస్ 
విద్యార్థులందరికీ సరైన హాస్టల్ వసతి కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని కొత్త అధ్యక్షుడు యశ్ దబాస్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ప్రత్యర్థి వర్గాలు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ తరం విద్యార్థులు (జెన్ జీ) ఎంతో చైతన్యవంతులని, వారిని ఎవరూ సులభంగా మభ్యపెట్టలేరని ఉపాధ్యక్షుడిగా గెలిచిన దీపాంశు శోకీన్ పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం నిజాయితీగా పనిచేస్తానని చెప్పారు. అలాగే, గతంలో జరిగిన సత్య నికేతన్ ఘటన బాధితులకు న్యాయం జరిగేవరకు చెప్పులు ధరించబోనని స్పష్టంచేస్తూ, న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థినుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని  సెక్రెటరీగా ఎన్నికైన రియా ఛావడీ వెల్లడించారు.