మీటర్​ కనెక్షన్ మార్చేందుకు రూ. 6 వేలు లంచం

 మీటర్​ కనెక్షన్ మార్చేందుకు రూ. 6 వేలు లంచం
  •      ఏసీబీకి పట్టుబడ్డ లాలాగూడ విద్యుత్ శాఖ లైన్ ఇన్ స్పెక్టర్

సికింద్రాబాద్, వెలుగు : కరెంట్ మీటర్ కనెక్షన్​ను మార్పు చేసేందుకు  లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్ ఇన్​స్పెక్టర్​ ఏసీబీకి చిక్కాడు.  లాలాగూడలోని టీఎస్ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసు పరిధిలో జి. వెంకటేశ్వర్లు లైన్​ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్నాడు.  ఇదే ప్రాంతంలో ఉండే  మహ్మద్ షాహిద్ ​అలీ తన ఇంటి విద్యుత్ మీటర్​ను కమర్షియల్​ కేటగిరీ నుంచి డొమెస్టిక్​ గా మార్చాలని  విద్యుత్ శాఖకు దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తును కొంతకాలంగా లైన్​ ఇన్​స్పెక్టర్​ పెండింగ్​లో ​ పెట్టాడు.

షాహిద్ పలుమార్లు వెళ్లి అడగగా వెంకటేశ్వర్లు రూ. 6వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం షాహిద్ లాలాగూడలో ​వెంకటేశ్వర్లుకు డబ్బు అందిస్తుండగా ఏసీబీ అధికారులు వెళ్లి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుని అరెస్ట్​ చేశారు. నిందితుడిని ఏసీబీ అడిషనల్ ​స్పెషల్​ జడ్జి ఎదుట హాజరు పరిచి, చర్లపల్లి జైలుకు తరలించారు.