
సిద్దిపేట అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ తనిఖీలు ముగిశాయి. సిద్దిపేటలోని ఇల్లు, ఆఫీస్ తో పాటు కామారెడ్డి, హైదరాబాద్ లోని షేక్ పేట్ లోని ఆదిత్య టవర్స్ లోని ఇంట్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదిత్య టవర్స్ లోని 5 వ అంతస్తులో ఉంటున్న నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు.
హైద్రాబాద్ తో పాటు కామారెడ్డి, సిద్ధిపేటలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మొత్తం 3 చోట్ల 20 ప్రత్యేక బృందాలతో ఒకేసారి తనిఖీలు చేశారు అధికారులు. ACB DSP సూర్యానారాణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. మొత్తం 30 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తుంది.
మరోవైపు సిద్దిపేట వన్ టౌన్ కానిస్టేబుల్ సాంబారెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. అక్రమ ఆస్తుల ఆరోపణలతో అధికారులు రైడ్ చేశారు.