
తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దడపుట్టిస్తోంది. గత కొన్ని నెలలుగా సెటిల్మెంట్లు, దందాలు , అవినీతి పోలీసులపై ACB గురి పెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీస్ శాఖలో కొందరు లంచాల కక్కుర్తికి ఉన్నతమైన ఉద్యోగానికి మకిలి పూస్తున్నారు.
ALSO READ | హైదరాబాద్: జోరుగా నకిలీ సర్టిఫికెట్ల దందా.. ఆరుగురు అరెస్ట్
నాలుగు నెలల్లో ఏసీబీ దాడుల్లో 14 మంది పోలీస్ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ వివాదాలు, ఇసుక దందా, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఏసీబీ నిఘాకు చిక్కి సస్పెన్షన్ అవుతున్నారు పోలీసులు. రక్షణ కల్పించాల్సిన రక్షకులు లంచాల ఉచ్చులో చిక్కుతున్నారు. సస్పెండయిన వాళ్ల ప్లేస్ లో కొత్త పోస్టింగుల కోసం పైరవీలు చేస్తున్నారు. పలు కేసుల్లో బాధితుల నుంచి భారీగా వసూళ్లతో ఏసీబీకి చిక్కుతున్నారు. దాడుల్లో హోంగార్డు నుంచి DSPల వరకు ఏసీబీకి పట్టుబడ్డారు.
ఏసీబీకి దొరికింది వీళ్లే..
- మే 12: సూర్య పేట డిఎస్పీ , సిఐలు ఏకంగా 25 లక్షల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు.
- జనవరి 6: జగదీష్, SHO , తొర్రూర్, రూ. 2 లక్షలు
- ఫిబ్రవరి 18: చంద్ర శేఖర్ SHO మక్తల్ , రూ.40వేలు
- మార్చి 5: శంకర్ , SI కోరుట్ల రూ.5వేలు
- ఏప్రిల్ 10: బరుపాటి రమేష్ SHO , భధ్రాచలం టౌన్ రూ. 20వేలు
- ఏప్రిల్ 18: నెల్కి సుగుణాకర్ , SI , నస్పూర్ రూ.30వేలు
- ఏప్రిల్ 21: సోమ సతీష్ కుమార్ SHO మణుగూరు రూ. 1లక్ష
- ఏప్రిల్ 28: పి. పరశురామ్ SI శామీర్ పేట రూ.22వేలు
- మే 12: కె.పార్థసారథి DSP సూర్యపేట 25లక్షల డిమాండ్
- మే12: పి.వీరరాఘవులు CI సూర్యపేట 25లక్షల డిమాండ్