భూమి పట్టా చేయడానికి 2 లక్షలు అడిగిండు

 భూమి పట్టా చేయడానికి 2 లక్షలు అడిగిండు

మెదక్ జిల్లాలో  ఓ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కాడు.  చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యలయంలో  రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీహరి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. శ్రీనివాస్ అనే రైతుకు భూమి పట్టా చేయడానికి శ్రీహరి రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్  చేశాడు. దీంతో  శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు శ్రీనివాస్  దగ్గరి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు అతన్ని రెడ్ హ్యాండడ్ గా పట్టుబడ్డాడు. దాదాపు 5 గంటలపాటు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.