యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇంచార్జి SE రామారావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బుధవారం ( అక్టోబర్ 29 ) ఏసీబీ అధికారులు నిర్వహించుడిన ఆకస్మిక సోదాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు రామారావు. కాంట్రాక్టర్ నుంచి రూ. లక్షా 90 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. ప్రసాదం తయారీ విభాగంలో మెషిన్ మెయింటెనెన్స్ కోసం బిల్లులు చెల్లించడానికి లంచం డిమాండ్ చేశాడు రామారావు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రామారావును రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ లోని మేడిపల్లి దగ్గర లంచం తీసుకుంటుండగా రామారావును పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మొదట రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసిన రామారావు.. రూ. లక్షా 90 వేలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపాడు బాధితుడు. రామారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.
