శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట మండలం బాబాగూడలోని తెలంగాణ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, హాస్టల్‌లో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
ఆహారం పదార్థాలు, విద్యార్థుల రిజిస్టర్, హాస్టల్ రికార్డులను పరిశీలించారు. హాస్టల్‌లో కిచెన్, బాత్రూం గదులు అపరిశుభ్రంగా కనిపించాయి. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

