గొర్రెల స్కాం నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి

గొర్రెల స్కాం నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి

గొర్రెల స్కాంలో అరెస్టై రిమాండ్ లో ఉన్న నలుగురు అధికారులను కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ఇవాళ్టి నుంచిమూడు రోజులు నిందితులను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి,సంగు గణేశ్  అరెస్ట్ అయ్యారు. 

వీళ్లు ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. రెండు కోట్ల 10 లక్షల రూపాయల బిల్లులను బినామీ ఖాతాలకు మళ్లించినట్లు బయటపడింది. దీనిపై మరింత లోతుగా నిందితులను విచారించనున్నారు ఏసీబీ అధికారులు.