ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : నిందితుల కస్టడీ పిటిషన్పై రేపు తీర్పు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : నిందితుల కస్టడీ పిటిషన్పై రేపు తీర్పు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు రామచంద్ర భారతి, కోరె నందు కుమార్, ‌‌‌‌‌‌‌ సింహయాజిల  కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. నిందితుల్ని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. రేపు కస్టడీ పిటిషన్ పై  ఏసీబీ కోర్టు తీర్పు ప్రకటించనుంది. 

ఇక అంతకుముందు  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. రామ చంద్రభారతి, కోరె నందు కుమార్, డీపీఎస్‌‌‌‌‌‌‌‌కేవీఎన్‌‌‌‌‌‌‌‌ సింహయాజి సంయుక్తంగా మంగళవారం అనుబంధ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. నిందితులు జైల్లో ఉన్నందున సంతకాలు చేయకుండా వారి తరఫున లాయర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఈ అనుబంధ పిటిషన్‌‌‌‌‌‌‌‌  వేశారు. ఈ నెల 9న ప్రభుత్వం సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఏడుగురితో ఏర్పాటు చేసిన సిట్‌‌‌‌‌‌‌‌పై స్టే ఉత్తర్వులు జారీ చేయాలని నిందితులు తమ పిటిషన్​లో కోరారు.