
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ ఇళ్లు, అతని బంధువుల ఇళ్లల్లో 12 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేట ప్లాట్, కరీంనగర్లో మూడు ప్లాట్లు, అమీర్ పేటలో కమర్షియల్ బిల్డింగ్, హైదరాబాద్ , కరీంనగర్, వరంగల్ లో మూడు ఇండిపెండెంట్ హౌస్ లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లో 19 ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా వేశారు అధికారులు.
శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమస్తులు కూడా పెట్టినట్టు గుర్తించింది ఏసీబీ. శ్రీధర్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి కొన్ని చోట్ల సోదాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు ఏసీబీ అధికారులు. నూనె శ్రీధర్ ఇరిగేషన్ ఇంజనీర్ల సంగం అధ్యక్షులుగా ఉన్నారు.
ALSO READ | ప్రజల సొమ్మును దోచుకున్న ఎవర్నీ వదలం.. కమిషన్ రిపోర్ట్ తర్వాత చర్యలు
ఒకవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతంగా సాగుతున్న సమయంలో.. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేసిన నూనె శ్రీధర్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేసిన అధికారులపై గతంలో కూడా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు . కాళేశ్వరం ENC గా పనిచేసిన హరిరామ్ ను అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.