డీఎస్పీ భీంరెడ్డికి ఏసీబీ కస్టడీ..రెండు రోజుల పాటు అనుమతిచ్చిన ఏసీబీ స్పెషల్ కోర్టు

డీఎస్పీ భీంరెడ్డికి ఏసీబీ కస్టడీ..రెండు రోజుల పాటు అనుమతిచ్చిన ఏసీబీ స్పెషల్ కోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డిని కస్టడీలో విచారించేందుకు ఏసీబీకి అనుమతి లభించింది. ఈ మేరకు ఏసీబీ స్పెషల్ కోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రెండ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. దీంతో చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూడ జైలు నుంచి గురువారం ఉదయం బీంరెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించి విచారించనున్నారు. 

కాగా, కస్టడీ విచారణలో ప్రధానంగా బినామీల ఆస్తులపైనే ఏసీబీ వివరాలు రాబట్టనున్నట్టు తెలిసింది. జులై 7న డీఎస్పీ భీంరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసందే. బెంగళూర్ ఎయిర్ పోర్టు సమీపంలోని దేవనపల్లిలో ఎకరం భూమి బినామీ నరేందర్ రెడ్డి పేరిట, తన వద్ద పనిచేస్తున్న హోంగార్డు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట కర్నాటక, జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో మొత్తం46 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించింది. సోదాల్లో 10 బ్యాంక్ అకౌంట్లు, రెండు లాకర్లను సీజ్ చేసింది.