ఆర్టీవో ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు

ఆర్టీవో ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట ఆర్టీవో ఆఫీస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో 15 మంది అధికారులు ఈ తనిఖీలను నిర్వహించి, ఆఫీస్ లో ఉన్న 200 అప్లికేషన్లను పరిశీలించగా, అందులో 70కి పైగా అప్లికేషన్లపై వివిధ కోడ్​లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదికను అందిస్తామని, ఈ విషయమై ఆఫీసుకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.