లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన GHMC ఉద్యోగి

లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన GHMC ఉద్యోగి

హైదరాబాద్:  రూ.36 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఉద్యోగి ఏసిబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. జగద్గిరిగుట్టకు చెందిన రాజు అనే వ్యక్తి  దగ్గర కూకట్ పల్లి బిల్ కలెక్టర్ మహేంద్ర నాయక్  లంచం డిమాండ్ చేశాడు. రాజుకి చెందిన ఎలక్ట్రానిక్స్ షాప్ ప్రాపర్టి ట్యాక్స్ తగ్గించేందుకు రూ.36 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రాజు పైఅధికారులను ఆశ్రయించగా.. అతని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మహేంద్ర నాయక్ ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.