ఏసీబీ అదుపులో రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన‌ ప్ర‌భుత్వాధికారి

ఏసీబీ అదుపులో రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన‌ ప్ర‌భుత్వాధికారి

అనంతపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.20 ల‌క్ష‌ల బిల్లులు విడుద‌ల చేయాలంటే 25,000 లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. 2019 ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో రాయ‌దుర్గం, విడ‌మ‌న‌క‌ల్, ధ‌ర్మ‌వరం స‌బ్ డివిజన్‌ మండ‌లాల‌కి చెందిన‌ పోలింగ్ బూత్‌ల‌లో ఎల‌క్ట్రిక్ ఎక్విప్‌మెంట్ (ఫ్యాన్స్, ట్యూబ్‌లైట్స్,..)అమ‌ర్చినందుకు స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ కు అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ నిధులు మంజూరు చేశారు. పంచాయ‌తీ రాజ్ ద్వారా ఆ బిల్లులు స‌మ‌కూర్చాలని ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ రబ్బానీ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఆ ఫండ్స్(రూ.20 ల‌క్ష‌లు) రిలీజ్ చేయాలంటే త‌న‌కు 25 వేల రుపాయ‌లు లంచం ఇవ్వాలని ర‌బ్బానీ డిమాండ్ చేయ‌డంతో.. బాధితులు ఏసీబీని ఆశ్ర‌యించారు. దీంతో ఏసీబీ అధికారుల‌ ప్లాన్ ప్ర‌కారం.. రుబ్బాని సప్తగిరి సర్కిల్ లో బాధితుని నుంచి 25 వేల రుపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడ్డ సూపరింటెండెంట్ ను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.