
తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా అక్టోబర్ 10న హైదరాబాద్ లాలాగూడ సబ్‌డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్-2 అధికారుల చేతిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారు.
సింగిల్ ఫేజ్ మీటర్ నుంచి త్రీ ఫేజ్ మీటర్ అప్‌గ్రేడ్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు సుధాకర్ రెడ్డి. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఫిర్యాదు దారు నుంచి లంచం స్వీకరించిన వెంటనే ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.
ఇవాళ ఉదయం అక్టోబర్ 10న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఇందిరమ్మ బిల్లు శాంక్షన్ కోసం పంచాయతీ సెక్రటరీ అనిల్ 10 వేలు డిమాండ్ చేశాడు. మధురానగర్లో ఉండే శ్రీకాంత్ నుంచి 10 వేల రూపాయలు పంచాయతీ సెక్రటరీ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
►ALSO READ | రూ.3 కోట్ల హవాలా డబ్బు సీజ్.. డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్‌పిన్ అరెస్ట్
అక్టోబర్ 9న నల్గొండ జిల్లాలో కూడా ఏసీబీ రైడ్స్లో ఏకంగా తహసీల్దార్ దొరికిపోయాడు. భూమిని మ్యుటేషన్ చేసేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసి.. మొదటి విడత కింద రూ. 2 లక్షలు తీసుకున్న నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ కృష్ణను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే.