
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం పంజా విసురుతోంది. భారీగా డ్రగ్స్ హవాలా మనీ రాకెట్ గుట్టును రట్టు చేసింది. ముంబైలో రూ. 3 కోట్ల84 వేల హవాలా డబ్బును సీజ్ చేసింది. ముంబై, రాజస్థాన్, గోవాలో స్పెషల్ ఆపరేషన్ లు నిర్వహించిన ఈగల్ పోలీసులు.. డ్రగ్స్ హవాలా రాకెట్ లో కీలక సూత్రధారుడుగా ఉన్న దర్గారం ప్రజాపతి అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు ఈగల్ పోలీసులు..
ఈగల్ పోలీసులు దాడులు చేయడంతో చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు దుర్గారం ప్రజాపతి. ముంబైతో పాటు అహ్మదాబాద్ ఢిల్లీలో హవాలా కార్యాలయాలు నిర్వహిస్తున్నాడు. మాక్స్వెల్ అనే నైజీరియన్ అరెస్టు చేయటంతో ఈ హవాలా రాకెట్ బాగోతం బయటపడింది. మాక్స్వెల్ దగ్గర నుంచి నాలుగు పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు పేర్లు మార్చుకొని ఫేక్ పాస్ పోర్టులతో ఇండియాలోకి వస్తున్నట్లు గుర్తించారు ఈగల్ పోలీసులు.
►ALSO READ | రియల్ ఎస్టేట్ పడిపోతే.. ఎవరైనా ఎకరా రూ. 170 కోట్లకు కొంటరా.?: భట్టి విక్రమార్క
హైదరాబాద్ లో డ్రగ్స్ ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా ముసుగులో పలు కంపెనీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు చేధించారు. ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి పలు రాష్ట్రాలు, దేశాలకు సరఫరా చేస్తున్నట్లు తేల్చారు.