శివబాలకృష్ణ కేసులో అరవింద్ కుమార్ విచారణకు ఏర్పాట్లు

శివబాలకృష్ణ కేసులో అరవింద్ కుమార్ విచారణకు ఏర్పాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శివబాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్‌‌ అరవింద్‌‌కుమార్‌‌‌‌ను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్ సర్వీసెస్‌‌ అధికారి కావడంతో ఏసీబీ విచారణకు డీవోపీటీ అనుమతి తప్పనిసరి.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీ అనుమతులు కోరినట్లు తెలిసింది. సంబంధిత డిపార్ట్‌‌మెంట్‌‌ అనుమతులు వచ్చాక అరవింద్‌‌కుమార్‌‌‌‌ను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా శివబాలకృష్ణ వెల్లడించిన వివరాల ఆధారంగా అవసరమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్‌‌కుమార్‌‌‌‌ను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేయనున్నారు.