
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం అడిగి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు మణుగూరు ఎస్ ఐ.. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో సీఐ పట్టుబడటం.. ఆతర్వాత కొద్ది రోజుల్లోనే ఎస్ ఐ లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారని బాధితుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ ఐ రంజిత్ ను ట్రాప్ చేసిన పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు.
ఈ కేసు సంబంధించి ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి దగ్గర నుంచి రూ. 40వేలు ఎస్ ఐ రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఆడియా, వీడియో టేపుల ఆధారంగా ఎస్ ఐ రంజిత్ ను పట్టుకుని కేసు నమోద చేశామన్నారు. విధి నిర్వహణ లో బాధ్యత గా ఉండాల్సిన పోలీసులే ఇలా లంచావతారం ఎత్తడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.