
తెలంగాణలో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. బుధవారం (జూన్ 11) ఒకేసారి 12 చోట్ల సోదాలు చేస్తున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో తనిశీలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.
నూనె శ్రీధర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేశారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకన్నారు.
ఒకవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతంగా సాగుతున్న సమయంలో.. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేసిన నూనె శ్రీధర్ ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేసిన అధికారులపై గతంలో కూడా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు . కాళేశ్వరం ENC గా పనిచేసిన హరిరామ్ ను అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.