
మీరెన్ని దాడులు.. ఎన్ని సోదాలైనా నిర్వహించండి. మా పద్ధతి మారదు. మీ పని మీరు చుసుకోండి.. మా పని చేసుకుంటూ పోతాం.. అన్నట్లుగా ఉంది ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో అవినీతి శాఖ (ఏసీబ) సోదాలు నిర్వహించి.. ఎందరిని అదుపులోకి తీసుకున్నా.. కనీసం భయం, లంచం తీసుకోవద్దనే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. లేటెస్టుగా హైదరాబాద్ కూకట్ పల్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెగ్ గా బుక్కయ్యాడు అసిస్టెంట్ లైన్ మన్.
శుక్రవారం (సెప్టెంబర్ 26) వసంత్ నగర్ సెక్షన్ విద్యుత్ శాఖ కార్యాలయం లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంత కాలంగా ఈ సెక్షన్ లో నిబంధనలకు విరుద్ధంగా మీటర్స్ జారీ చేస్తూ కేబుల్స్ లాగుతున్నారని ఆరోపణ ఉంది. ఒక వినియోయాగ దారుడి నుంచి ఇంటి వైర్ మార్చేందుకు (5kv నుండి 11kv ) శ్రీకాంత్ గౌడ్ అనే అసిస్టెంట్ లైన్ మన్ 30 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఒక ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
చివరికి 11 వేలకు ఒప్పందం కుదిరినట్లు చెప్పడంతో.. ఆ మొత్తాన్ని ఇవ్వమని చెప్పి నిఘా ఉంచారు అధికారులు. సరిగ్గా డబ్బులు తీసుకుంటున్న సమయంలో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వివిధ ఆరోపణల ఆధారంగా సెక్షన్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నారు.